- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె నా లైఫ్‌ను కలర్‌ఫుల్‌గా మార్చేసింది.. పరిణీతిపై రాఘవ్ ప్రశంసలు
దిశ, సినిమా: కాబోయే భార్య, నటి పరిణీతి చోప్రాపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రశంసలు కురిపించాడు. కొంతకాలంగా డేటింగ్ చేసి ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జోడి త్వరలోనే పెళ్లిపీఠలెక్కనుంది. ఈ సందర్భంగా తమ రీలేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన రాఘవ్.. ‘ఒక అందమైన అమ్మాయి.. మంచి రోజున నా జీవితంలోకి వచ్చింది. నా లైఫ్‌ను కలర్ ఫుల్‌గా మార్చేసింది. ఎన్నో ఆనందాలు, నవ్వులతో మా నిశ్చితార్థం హ్యాపీగా జరిగింది. ఆనందబాష్పాలు, సంతోషాలు, డ్యాన్స్‌లతో నిశ్చితార్థ వేడుక కలకలలాడింది. ప్రియమైన వారిని మాకు మరింత దగ్గర చేసింది. పరిణీతి సంతోషం పట్టలేక భావోద్వేగానికి గురైంది. అందరిలాగే నేనూ సాధారణ అబ్బాయిగా ఆమెను ఓదార్చాను’ అంటూ సరదాగా పలు విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన కాబోయే భార్యగురించి చెప్పిన స్వీట్ కామెంట్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యామంటున్నారు.
Read More: నరేష్‌లో తనను బాగా ఆకట్టుకున్నది అదేనంటూ.. అసలు విషయం చెప్పిన పవిత్ర లోకేష్