ఇద్దరు భార్యల ముద్దుల హీరో.. ముగ్గురు కలిసే అలా చేశారు..

by Prasanna |   ( Updated:2023-08-25 04:58:25.0  )
ఇద్దరు భార్యల ముద్దుల హీరో.. ముగ్గురు కలిసే అలా చేశారు..
X

దిశ, సినిమా : మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. దీంతో మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడనే వార్తలు వచ్చాయి. అయితే అలాంటిది జరగదేమో అంటున్నారు నెటిజన్స్. కజిన్ బ్రదర్ మన్సూర్ ఖాన్ బుక్ లాంచ్ ఈవెంట్‌కు ఎక్స్‌ వైవ్స్, కొడుకుతో రావడమే ఇందుకు కారణం. పైగా అమీర్ భార్యలు రీనా దత్త, కిరణ్ రావ్ జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా నవ్వుకోవడం కనిపించడంతో.. ఇక థర్డ్ మ్యారేజ్ రూమర్స్‌ ఫేక్ అనిపిస్తుందని అంటున్నారు. ఇక 1986లో రీనా దత్తను మ్యారేజ్ చేసుకున్న అమీర్.. 16ఏళ్ల తర్వాత విడాకులిచ్చి.. రెండో భార్య కరణ్‌తో ఏడడుగులు నడిచాడు. కానీ ఏడాది క్రితం ఆమెకు కూడా డైవోర్స్ ఇచ్చేశాడు. అయితే ప్రస్తుతం ఫ్యామిలీ మొత్తం ఎలాంటి మనస్పర్థలు లేకుండా, ఫ్రెండ్లీగా ఉంటున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed