- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అఖిల్ అమలను చాలా వేధించాడు డాక్టర్‌కు చూపించింది..నాగార్జున కామెంట్స్ వైరల్.!
దిశ, వెబ్ డెస్క్: అక్కినేని హీరో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రం ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. తాజాగా, వరంగల్‌లో ‘ఏజెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఇందులో భాగంగా అఖిల్ గురించి వైరల్ కామెంట్స్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ ఈ సినిమా కోసం అఖిల్ 9 నెలల నుండి అఖిల్ చాలా కష్టపడ్డాడు. అలాగే తొమ్మిది నెలల్లో ఇలాంటి లుక్ రావడంతో అంటే మామూలు విషయం కాదు. తన బాడీ చేంజ్ చేసుకోవడానికి అఖిల్ చాలా కష్టపడ్డాడు. అఖిల్ చిన్నప్పటి నుండి హైపర్ యాక్టివ్‌గా ఉండేవాడు. వాడి అల్లరి భరించలేక అమల డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి వాడిని చూపించింది. అయితే డాక్టర్ మాత్రం ప్రతిరోజు ఒక గంట ఇంటి దగ్గర ఉండే మట్టిలో కూర్చోబెట్టమని చెప్పారు. వాడిలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మొత్తం భూమి లోపలికి వెళ్తాయని డాక్టర్ అలా చెప్పాడు. ఇక ప్రస్తుతం అఖిల్‌లో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం ఖర్చు చేశాడు. ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read more: