- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫాలోవర్స్‌ను కాదు.. ప్రతిభను గుర్తించండి: మేకర్స్‌పై నటి ఫైర్
దిశ, సినిమా: ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో యాక్టింగ్ మెరిట్ కాకుండా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆధారంగా వ్యక్తులను నియమించుకునే ధోరణిని విమర్శించింది నటి అహానా కుమ్రా. ఈ పద్ధతి చాలామంది నటీనటుల భవిష్యత్తును గందరగోళానికి గురిచేస్తుందని, తనను కూడా రచయితగా మార్చేసిందని చెప్పింది. ‘ఇలా చెబుతున్నందుకు క్షమించండి. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నవాళ్లను సెలక్ట్ చేయడం సరైనది కాదు. చాలా పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వస్తున్న చాలా షోలు వీళ్లతోనే నిండిపోయాయి. నిజం చెప్పాలంటే వాళ్లకంటే నటనా రంగంలో ఎంతోమంది ప్రభావశీలురు ఉన్నారు. దీని గురించి చర్చించడానికి చాలామంది ఆడపిల్లలు నా దగ్గరకు వచ్చారు. వాళ్లంతా సోషల్ మీడియాలో అనుచరులు లేరని చెబుతుంటే వినడానికి హృదయ విదారకంగా ఉంది. నేటి చిత్రనిర్మాతలు, కాస్టింగ్ డైరెక్టర్లు సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య కాకుండా టాలెంట్ ఉన్నవాళ్లపై శ్రద్ధ వహించాలి’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
డబుల్ బెడ్ సోఫా.. జరీనాఖాన్‌పై భారీ ట్రోలింగ్