వారి పై అంత ప్రేముంటే ఇంట్లోకి పిలిపించుకోండి.. అంటూ రజనీ కాంత్ పై ఓ మహిళ వైరల్ కామెంట్స్..!

by Kavitha |
వారి  పై  అంత ప్రేముంటే ఇంట్లోకి పిలిపించుకోండి.. అంటూ రజనీ కాంత్ పై ఓ మహిళ వైరల్ కామెంట్స్..!
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికీ అదే ఊపుతో దూసుకుపోతున్నాడు. 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో సినిమాలలో నటిస్తున్నాడు. అయితే ఆయన పుట్టినరోజు నాడు, పండుగలు ఉన్న సందర్భాల్లో అభిమానులు తలైవా ఇంటి ముందు సందడి చేస్తుంటారు.. రజనీకాంత్‌ కూడా ఇంటి బయటకు వచ్చి చెయ్యెత్తి అభివాదం చేసే వరకు అక్కడి నుంచి కదలరు. ఈ క్రమంలో తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలోని రజనీకాంత్‌ ఇంటి ముందు అభిమానులు బారులు తీరారు. దీంతో యథావిధిగా రజనీకాంత్‌ వారికి కనిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపి.. ‘అందరూ ఆరోగ్యంగా, మనశ్శాంతిగా, సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నా’ అని ఆయన అభిమానులకు తెలిపాడు.

ఇంత వరకు భాగునప్పటికి రజనీకాంత్‌ పక్కింటిలో ఉండే ఒక వృద్ధ మహిళ తన అసహనాన్ని వ్యక్తం చేసింది.. ‘ తలైవా తలైవా అంటూ అరుస్తూ మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు. ఏం మీ అభిమానుల మీద అంత ప్రేమ ఉంటే మీ ఇంటి గేటు తెరిచి వారిని లోనికి పిలిపించుకోవచ్చుగా. మేము ఇంటి పన్ను కడుతున్నాము అయినా మాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఉదయాన్నే అది పండుగ రోజు వచ్చి ఇలా ఇబ్బందికి గురి చేస్తున్నారు, దేవున్ని కూడా ప్రార్థించలేకపోతున్నాము’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.. అంతే కాదు ఇక్కడ సెక్యూరిటీ, అభిమానులతో వాగ్వాదానికి దిగింది.



Advertisement

Next Story

Most Viewed