కమెడియన్‌తో రొమాన్స్ చేయబోతున్న కీర్తి సురేష్.. ఎవరో తెలిస్తే షాక్!

by Anjali |   ( Updated:2024-03-20 14:24:14.0  )
కమెడియన్‌తో రొమాన్స్ చేయబోతున్న కీర్తి సురేష్.. ఎవరో తెలిస్తే షాక్!
X

దిశ, సినిమా: ‘నేను శైలజ, రంగ్ దే, నేను లోకల్, మిస్ ఇండియా, మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను తన క్యూట్‌నెస్ తో కట్టిపడేసింది హీరోయిన్ కీర్తి సురేష్. టాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన అవకాశం కొట్టేసింది. అగ్ర హీరోల జంటగా నటించే ఈ అమ్మడు.. తాజాగా ఓ కమెడియన్ పక్కకు నటించేందుకు సిద్ధమయ్యింది.

ఆ కమెడియన్ ఎవరో కాదు.. కలర్ ఫొటో సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో గుర్తింపు సొంతం చేసుకున్న సుహాన్. కెరీర్ స్టార్టింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి.. తర్వాత విలన్ గా, ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యాడు. సుహాన్ హీరోగా నటించిన కలర్ ఫొటో చిత్రానికి ఏకంగా పద్మ విభూషణ్ కూడా అందుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అంబాజీపేట బ్యాండ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే నెక్స్ట్ సుహాన్ ఆనందరావు అడ్వెంచర్స్, ప్రసన్న వదనం, గొర్రె పురాణం, శ్రీరంగనీతులు వంటి సినిమాల్లో కూడా నటిస్తున్నారట.

ఇకపోతే తాజాగా అమెజాన్ ప్రైమ్ వారు ఓటీటీ లో రిలీజ్ చేసే వెబ్ సిరీస్ లకు సంబంధించి పలు పోస్టర్లు విడుదల చేశారు. అందులో భాగంగా కీర్తి సురేష్ - సుహాన్ కలయికలో ఉప్పుకప్పురంబు అనే వెబ్ సిరీస్ కూడా ఉంది. ఈవెంట్ కు సుహాన్ హాజరవ్వగా.. కీర్తి షూటింగ్ కారణంగా రాలేకపోయినట్లు తెలుస్తోంది. మంచి కంటెంట్ ఉంటే చిన్న హీరో పెద్ద హీరో అని ఎలాంటి వేరియేన్స్ చూపించదు. కీర్తిది గుడ్ హార్ట్ అంటూ నెటిజన్లు ఈ హీరోయిన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story