ఛీ ఇదేం సిగ్గుమాలిన పని.. కాజల్‌తో సెల్ఫీ కోసం వచ్చి అక్కడ తాకిన యువకుడు(వీడియో)

by Jakkula Samataha |   ( Updated:2024-05-18 05:53:18.0  )
ఛీ ఇదేం సిగ్గుమాలిన పని.. కాజల్‌తో సెల్ఫీ కోసం వచ్చి అక్కడ తాకిన యువకుడు(వీడియో)
X

దిశ, సినిమా : చందమామ ముద్దుగుమ్మ కాజల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వన్నె తగ్గని అందం ఆమె సొంతం. లక్ష్మీ కళ్యాణం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్యూటీ వెనక్కు తిరిగి చూసుకోలేదు. వరసగా ఆఫర్స్ రావడం, సినిమాలు చేస్తూ పోవడం చేసింది.

ఇక గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకోవడం, ఓ బాబుకు కూడా కాజల్ జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత కూడా వరస ఆఫర్స్‌తో దూసుకెళ్తోంది. అయితే తాజాగా కాజల్‌కు ఘోర అవమానం జరిగింది. ఇటీవల ఓ హైదరాబాద్‌లో ఓ స్టోర్ ప్రారంభోత్సావానికి కాజల్ వెళ్లారు. అయితే అక్కడ వందలాది మంది ఆమె చుట్టూ చేరారు. దీంతో ఓ యువకు కాజల్,‌తో ఫోటో దిగడానికి వచ్చి, అసభ్యంగా తాకాడు. దీంతో ఒక్కసారిగా షాకైన కాజల్, వెంటనే తన అసహనాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం దీనికి సం బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన జనం, ఆ యువకుడిని తిట్టిపోస్తున్నారు.

Advertisement

Next Story