‘స్వాగ్’ సినిమాలో మహారాణి రుక్మిణీ దేవిగా టాలెంటెడ్ హీరోయిన్..

by Hamsa |
‘స్వాగ్’ సినిమాలో మహారాణి రుక్మిణీ దేవిగా టాలెంటెడ్ హీరోయిన్..
X

దిశ, సినిమా: అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోయిన్స్‌లో రీతు వర్మ ఒకరు. తన అందం, అభినయంతో ఈ అమ్మడు పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్‌గా పేరు సంపాదించుకుని హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది. హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. రీతు వర్మకు ఈ సిరీస్ డిజిటల్ డెబ్యూ కానున్నట్లు టాక్. ప్రజెంట్ ఈ అమ్మడు ‘స్వాగ్’ తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్దంగా ఉంది.

అయితే శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు హసిత్ గోలి రూపొందించగా.. అక్టోబర్ 4న థియేటర్స్‌లోకి రానుంది. అయితే ఇందులో రీతు వర్మ వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం బయటకు రావడంతో ‘స్వాగ్’ లో రీతు వర్మ క్యారెక్టర్‌పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు ఇష్టపడే రీతు వర్మ.. మహారాణి రుక్మిణీదేవి పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed