దేశం కాని దేశంలో చీపురు చేతబట్టి మొత్తం క్లీన్ చేసిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?

by GSrikanth |   ( Updated:2023-10-03 12:28:13.0  )
దేశం కాని దేశంలో చీపురు చేతబట్టి మొత్తం క్లీన్ చేసిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఖిలాడీ, సూర్యవంశీ, చిత్రాలతో సౌత్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ హీరోకు గడ్డ పరిస్థితి ఎదురవుతోంది. చేసిన ప్రతీ సినిమా బాక్సాపీస్ వద్ద బోల్తా కొడుతోంది. ఇటీవల నటించిన OMG కూడా ఫ్యాన్స్ నుంచి షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. దీంతో కథల విషయంలో జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, ఇదిల ఉండగా.. తాజాగా.. అక్షయ్ కుమార్ చీపురు చేతబట్టి బీచ్‌ను శుభ్రం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛతా హి సేవ’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా దేశంలోని ప్రముఖులంతా పాల్గొన్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఇదే పని చేశారు. అక్షయ్ కుమార్ చీపురు చేతపట్టి బీచ్‌ను శుభ్రం చేశారు. ఈ ఫోటోను అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఇండియాలో లేరు. అయినప్పటికీ ఆయన స్వచ్ఛతా హి సేవలో పాల్గొన్నారు. ‘మీ పరిసరాలను, మనసును శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించండి’ అంటూ అక్షయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

Read More: మీరు చూసిన దానికంటే చూడనిది చాలా ఉందంటూ బిగ్‌బాస్ బ్యూటీ పోస్ట్..

Advertisement

Next Story