12th Fail : విక్రాంత్ మస్సే ‘12th ఫెయిల్’ సినిమాకు అరుదైన గౌరవం..

by Hamsa |
12th Fail : విక్రాంత్ మస్సే ‘12th ఫెయిల్’ సినిమాకు అరుదైన గౌరవం..
X

దిశ, సినిమా: విధు వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘12th ఫెయిల్’. ఇందులో విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఇది చిన్న సినిమాగా గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. అంతేకాకుండా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తాజాగా, ‘12th ఫెయిల్’ సినిమా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.

ఈ మూవీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (సీజేఐ) కోసం ఏకంగా సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రదర్శించారు. అయితే ఈ చిత్రాన్ని న్యాయవాదులతో పాటు 600 మంది సుప్రీంకోర్టు అధికారులు, వారి కుటుంబ సభ్యులు, చిత్రబృందం చూసినట్లు సమాచారం. ‘12th ఫెయిల్’ మూవీ చూసిన అనంతరం సీజేఐ ప్రశంసలు కురిపించారు. ‘‘ఇలాంటి సినిమాలు అందరిలో స్ఫూర్తి నింపుతాయి. ఇందులోని కొన్ని సన్నివేశాలకు నా కళ్లు చెమర్చాయి. ఓ గొప్ప సందేశాన్ని ఈ మూవీ ఇస్తుంది. అందరి తరపున 12th ఫెయిల్ టీమ్‌కు ధన్యవాదాలు’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed