Samantha: సమంతకు అరుదైన గౌరవం.. ఆ అవార్డు అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

by Hamsa |
Samantha: సమంతకు అరుదైన గౌరవం.. ఆ అవార్డు అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న సౌత్ కథానాయికలలో సమంత ముందు వరుసలో ఉంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన సామ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఆమె కోసం కొందరు చనిపోవడానికి కూడా సిద్ధపడతారనడంలో అతిశయోక్తి లేదు. అయితే గత కొద్ది కాలంగా ఈ అమ్మడుకి మయోసైటీస్ వ్యాధి రావడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు తొందరగా కోలుకొని సినిమాలను చేయాలని పదే పదే నెట్టింట పోస్టులు పెట్టారు. అయితే ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నాను అని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో.. తాజాగా, సమంత ఓ అరుదైన గౌరవం దక్కించుకుంది.

‘వుమెన్ ఆఫ్‌ది ఇయర్’ అవార్డును సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా జరుగుతుండగా.. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఎంతోమంది స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో సామ్‌కు నిర్వాహకులు ప్రతిష్ఠాత్మక ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’తో సత్కరించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాలు చేయకపోయినా అందరినీ ఓడించి ఈ అవార్డు అందుకోవడం గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed