గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం

by Gantepaka Srikanth |
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యూఎస్, జపాన్‌, సింగపూర్‌(Singapore)లలో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. తాజాగా రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌(Madame Tussauds)లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. రామ్ చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహం కూడా ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే ఫోటో షూట్ పూర్తి అయింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా రామ్ చరణ్ షేర్ చేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాలో నటిస్తున్నారు. దాంతో పాటు బుచ్చిబాబు సన డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సింగపూర్‌లోని టుస్సాడ్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ల మైనపు విగ్రహాలను పొందుపర్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో రామ్ చరణ్ కూడా చేయడంతో చేరడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

Advertisement

Next Story