OTTలోకి సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

by Jakkula Samataha |
OTTలోకి సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
X

దిశ, సినిమా : థ్రిలింగ్ గా ఉండే సినిమాలు చూడాలని ఎవరకీ ఉండదు. చాలా మంది థ్రిలింగ్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఓటీటీ వచ్చినప్పటి నుంచి యూత్ ఎక్కువగా థ్రిలింగ్‌గా ఉండే వెబ్ సిరీస్ చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓటీటీలోకి సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. శివ కోన దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ కామెడీతోపాటు సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఎల్ ఎస్ డీ( ఫ్రిబ్రవరి 2) ఈరోజు శుక్రవారం ఓటీటీలో సందడి చేయనుంది.

లవ్, సెక్స్, డెత్ కాన్సెప్ట్ తో మూడు జంటల మధ్య జరిగే సన్నివేషాలను ఆద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ఈ రోజు నుంచే తెలుగుతో పాటు హీందీ భాషలో అందుబాటులోకి రానుంది.

ఇక శివ కోన, అనిల్ మోదుగ కలిసి నిర్మించిన ఈ వెబ్ సరీస్‌కు రవి సంద్రాన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశారు. అలాగే ప్రవీణ్ మని, శశాంక్ తిరుపతిలు సంగీత దర్శకులుగా వ్యవహరించగా, పవన్ గుంటుకు, హరిష్ ఈడిగలు సినిమాటోగ్రఫీ, ఎడిటర్‌గా శివ కోన పని చేశారు.అలాగే ఈ థ్రిలింగ్ వెబ్ సిరీస్‌లో నేహా దేశ్‌పాండే, ప్రాచీ ఠాకర్, ప్రభాకర్ పొడకండ్ల, శివ కోన, అభిలాష్ బండారి, కునాల్ కౌశిక్, రమ్య దినేష్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

Next Story