మరీ ఇంత ఘోరంగా అవమానించాలా.. మిస్టర్ బచ్చన్ డైరెక్టర్‌ను తలదించుకునేలా చేసిన నెటిజన్.. నెట్టింట స్క్రీన్ షాట్స్ వైరల్

by sudharani |
మరీ ఇంత ఘోరంగా అవమానించాలా.. మిస్టర్ బచ్చన్ డైరెక్టర్‌ను తలదించుకునేలా చేసిన నెటిజన్.. నెట్టింట స్క్రీన్ షాట్స్ వైరల్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. భాగశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించాడు. అంతే కాకుండా రిలీజ్‌కు ముందు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ప్రేక్షకుల్లో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఎట్టకేలకు నేడు (ఆగస్టు 15) రిలీజైనా ఈ చిత్రం.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదని తెలుస్తుంది. దీంతో మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా చూసిన వారు తమ రివ్వ్యూలను ట్విట్టర్ వేదికగా ఇస్తున్నారు.

చాలా మంది నెగిటివ్ రివ్వ్యూలతో ట్విట్టర్‌లో సంచలనం సృష్టిస్తున్నారు. ‘అదీ ఒక సినిమానా? ఇలా కూడా తీస్తారా?’ అంటూ దారుణంగా ఏకిపారేస్తున్నారు. అంతే కాకుండా ఇక ఇలాంటి క్రింజ్ సినిమాలను తీయడం ఆపేయ్ అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు డైరెక్ట్‌గానే వార్నింగ్‌లు ఇస్తున్నారు నెటిజన్లు. అయితే.. ప్రేక్షకులు ఇచ్చే రివ్వ్యూలను గమనిస్తున్న డైరెక్టర్ సినిమాపై పాజిటివ్ రివ్వ్యూ ఇచ్చిన వాళ్లకు రిప్లై ఇస్తూ.. నెగిటివ్ రివ్వ్యూ ఇచ్చిన వాళ్లను పక్కన పెట్టేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఎంతకు తెగించాడండే.. దీంతో హరీష్ శంకర్ పరువు కూడా పోయినట్లు అయింది.

ఈ మేరకు ఓ నెటిజన్ ‘ఫేక్ రివ్వ్యూలను నమ్మకండి.. మూవీ చాలా బాగుంది. రవి అన్నకు మంచి కమ్ బ్యాక్ ఇచ్చావు హరీష్ శంకర్. థాంక్యూ సో మచ్’ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై స్పందించిన డైరెక్టర్ థాంక్యూ అన్నట్లుగా రిప్లై ఇచ్చాడు. ఇక డైరెక్టర్ రిప్లై పై రియాక్ట్ అయినా నెటిజన్ ‘నువ్వు రిప్లై ఇస్తావనే నేను సొల్లు చెప్పా’ అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో హరీష్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. దీంతో పలువురు నవ్వుకుంటుంటే.. రిప్లై కోసం డైరెక్టర్ పరువు తిశావు కదరా అంటూ మరికొందరు అంటున్నారు.





Advertisement

Next Story

Most Viewed