మనిషి మాంసం లేనిదే ముద్ద దిగని ఓ లేడీ డాక్టర్..ఈ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే?

by Prasanna |
మనిషి మాంసం లేనిదే ముద్ద దిగని ఓ లేడీ డాక్టర్..ఈ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే?
X

దిశ, సినిమా : ఓటీటీ వచ్చిన తర్వాత అన్ని భాషల సినిమాలు మన ఇంట్లోనే చూస్తున్నాము. మనలో చాలా మంది డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ లో క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్‌ సినిమాలను చూస్తుంటారు. ఇతర జానర్‌లతో పోలిస్తే, ఇవి OTTలో ఎక్కువ జనాదరణ పొందాయి. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మరో చిత్రం OTT ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే 'ఆమిస్'. అస్సామీ భాషలో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. దాంతో సినిమాకు చాలా బజ్ వచ్చింది. ప్రస్తుతం ప్రముఖ OTT ప్లాట్‌ ఫామ్ సోనీ లివ్ లో ప్రసారం అవుతుంది ఈ రొమాంటిక్ థ్రిల్లర్..

ఆమిస్ అంటే అస్సామీలో మాంసాహారం. ఈ మూవీ మాంసాహార వంటకాల చుట్టూ తిరుగుతుంది. సుమన్ అనే కుర్రాడు గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు. తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లి అక్కడ దొరికిన జంతువుల మాంసాన్ని తింటాడు. ఇలా తిన్న తర్వాత .. ఓ రోజు తన స్నేహితుడి ఆరోగ్యం దెబ్బతింటుంది. నిర్మలి అనే లేడి డాక్టర్ వద్దకు వైద్యం కోసం వెళ్తాడు. దీంతో వారి మధ్య పరిచయం పెరుగుతుంది. ఆమెకు మాంసం అంటే ఇష్టమని, మరుసటి రోజు కుందేలు వండుకుని తీసుకుని వెళ్తాడు.

నిర్మలికి అప్పటికే పెళ్లై ఓ పాప కూడా ఉంది. అయితే వారిద్దరూ చాలా దగ్గరయ్యారు. రోజుకో జంతువు మాంసాన్ని టేస్ట్ చేపించే వాడు. ఈ క్రమంలో అతడికి, ఆమెపై ప్రేమ పెరిగి తన శరీరంలో ఒక భాగాన్ని కోసి.. వండి నిర్మలకి తినిపిస్తాడు. అది, ఆమెకు చాలా నచ్చేస్తుంది. ఆ లేడీ డాక్టర్ నెమ్మదిగా మనిషి మాంసానికి అలవాటు పడుతుంది. నిర్మలి కోసం సుమన్ ఏం చేసాడనేది ఈ కథ .. అది .తెలియాలంటే ఆమీస్ సినిమా చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed