బిచ్చమెత్తుకుంటున్న ఒకప్పటి స్టార్​ హీరోయిన్

by Sridhar Babu |   ( Updated:2023-12-29 14:23:05.0  )
బిచ్చమెత్తుకుంటున్న ఒకప్పటి స్టార్​ హీరోయిన్
X

దిశ, వెబ్​డెస్క్​ : సినిమా అనే రంగుల ప్రపంచంలో కళాకారుల జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అసలు ఈ రంగంలోకి రావడమే చాలా కష్టం. వచ్చినా నిలదొక్కుకోవడం ఇంకా కష్టం. ఇలా ఎంతో మంది సినీ కళాకారులు తెరపై ఒక వెలుగు వెలిగి అంతలోనే అదృశ్యమవుతుంటారు. ఇలాంటి పరిస్థితినే ఓ స్టార్​ హీరోయిన్​ అనుభవిస్తుంది. ఒకప్పుడు స్టార్​ హీరోయిన్​గా ఉండి నేడు బిచ్చమెత్తుకొని జీవిస్తూ దుర్భర జీవితం గడుపుతుంది. ఈమె మొదట పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

అంతలోనే ఆమె జీవితం మారిపోయింది. అవకాశాలు తగ్గిపోవడంతో బతకడమే కష్టంగా మారింది. చివరికి బిచ్చమెత్తుకుంటుంది. ఆమే భోజ్‌పురి పాపులర్‌ హీరోయిన్‌ మిథాలీ శర్మ. ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ భోజ్‌పురిలో ఫేమస్‌ హీరోయిన్‌. ఈమె మొదట సినిమాలపై ఆసక్తితో ఇంట్లోనుంచి పారిపోయి వచ్చింది. మోడలింగ్‌ చేసి తనేంటో నిరూపించుకుంది. దర్శక, నిర్మాతలు మిథాలీతో సినిమా తీసేందుకు పోటీపడ్డారు. కానీ సడన్‌గా ఆమె జీవితం దుర్భరమైంది. ప్రస్తుతం ఆమె డబ్బులు లేక బిచ్చమెత్తుకుంటుంది.

Read More..

అలా చేసేందుకు పెళ్లి ఎందుకు సహజీవనం చేస్తా.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

Advertisement

Next Story

Most Viewed