నరేష్ భార్య రమ్య రఘపతిపై కేసు నమోదు

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-29 06:12:00.0  )
నరేష్ భార్య రమ్య రఘపతిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పవిత్ర లోకేష్ ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. పవిత్రపై అసత్య వార్తల ప్రచారంలో రమ్య రఘుపతి పాత్రపై నిర్ధారణకు వచ్చాకే నోటీసులిస్తామని పోలీసులు తెలిపారు. జర్నలిస్టు ఇమంది రామారావుకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు పోలీసుల విచారణకు ఇమంది రామారావు హాజరుకానున్నారు. ఇమంది టాక్స్ పేరుతో యూట్యూబ్ ఛానళ్లో వీడియోలు అప్ లోడ్ చేశారు. ఇమంది టాక్స్ పేరిట పవిత్రపై జరుగుతున్న ప్రచారంలో నరేష్ భార్య రమ్య పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనపై ట్రోల్స్ చేయడంతో పవిత్ర లోకేష్ నిన్న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. మొత్తం 10 యూట్యూబ్ ఛానళ్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి : " తోడేలు " సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్

Advertisement

Next Story