ఏం జరుగుతుందో తెలిసినప్పుడు విరామం అనేది చెడ్డ విషయంగా అనిపించదు.. సమంత పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-07-14 07:00:07.0  )
ఏం జరుగుతుందో తెలిసినప్పుడు విరామం అనేది చెడ్డ విషయంగా అనిపించదు.. సమంత పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇటీవల మయోసైటీస్ వ్యాధి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. వ్యాధి తిరగబడటం తో ఆమె ఒక సంవత్సరం పాటు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయినా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

తాజాగా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ సిటాడెల్‌ను పూర్తి చేశాను. ఏం జరుగుతుందో మీకు తెలిసినప్పుడు విరామం అనేది చెడ్డ విషయంగా అనిపించదు. రాజ్ అండ్ డీకే నాకు కుటుంబంతో సమానం ప్రతి ఒక్క యుద్ధంలో నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. ప్రపంచంలో అన్నింటి కంటే ఎక్కువగా మిమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు నా కోసం మరో పాత్ర రాసే వరకు ఇదే నా బెస్ట్’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే మలయాళం, ఇంగ్లిష్ సినిమాలు ఇవే..

డిప్రెషన్‌తో సమంత డ్రగ్స్ తీసుకుందంటూ.. సంచలనం సృష్టిస్తున్న పోస్ట్

Advertisement

Next Story