2024 IIFA: ఈవెంట్‌లో ఏకంగా 150 మందితో డ్యాన్స్ చేయనున్న నటి

by Hamsa |
2024 IIFA: ఈవెంట్‌లో ఏకంగా 150 మందితో డ్యాన్స్ చేయనున్న నటి
X

దిశ, సినిమా: ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో సెప్టెంబర్ 27, నుంచి 29 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే అక్కడికి సినీ సెలబ్రిటీలు చేరుకున్నారు. అయితే ఇందులో సీనియర్ నటి రేఖ డ్యాన్స్ చేయనున్నారు. ఏకంగా 150 మంది డ్యాన్సర్లతో 22 నిమిషాల పాటు వేదికపై స్పెప్పులేయనున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా ఆమె డ్యాన్స్ ప్రదర్శన ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఐఫా ఈవెంట్‌లో డ్యాన్స్ చేసే అవకాశం లభించడంపై రేఖ స్పందిస్తూ.. ‘‘ఐఫాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది అవార్డుల వేడుక మాత్రమే కాదు కళ, సంస్కృతి, ప్రేమను సూచిస్తుంది. ఐఫా వేదిక నాకు సొంత ఇంటి లాగా అనిపిస్తుంది. ఈ వేదికపై డ్యాన్స్ చేసి భారతీయతను చాటడం నాకు లభించిన ఓ అవకాశం. ఇంత గొప్ప ఫెస్టివల్‌లో మరోసారి భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. అలాగే మధురమైన జ్ఞాపకాలు సృష్టించుకోవడానికి ఎదురు చూస్తున్నాను. ఐఫాలో డ్యాన్స్ చేయబోతుండటం చాలా ఆనందంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed