రేటు పెంచిన యంగ్ బ్యూటీ! కోటికి పైగా డిమాండ్!

by Disha Newspaper Desk |
రేటు పెంచిన యంగ్ బ్యూటీ! కోటికి పైగా డిమాండ్!
X

దిశ, సినిమా: రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన చిత్రం 'పెళ్లి సందడి'. ఈ మూవీలో రోషన్‌కు జోడీగా నటించిన కన్నడ బ్యూటీ శ్రీలీల.. తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ దక్కించుకుంది. తన నటనతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం రవి‌తేజ హీరోగా త్రినాథ‌రావ్ నక్కిన దర్శకత్వంలో వస్తున్న 'ధమాకా లో ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించేందుకు భారీ ఆఫర్స్ వస్తుండటంతో రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఇకపై తాను చేయబోయే చిత్రాలకు కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. యంగ్ హీరోలకు గుడ్ చాయిస్‌గా కనిపిస్తున్న శ్రీలీల.. వైష్ణవ్ తేజ్‌, నవీన్ పోలిశెట్టి‌తో వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది.

https://www.instagram.com/p/CZD6mnYJyW4/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story