- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లక్షణాలుంటేనే క్వారంటైన్: మంత్రి ఈటల
దిశ, న్యూస్‌బ్యూరో: వివిధ రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోకి దేశీయ విమానాల ద్వారా, రైళ్ళ ద్వారా, రోడ్డు మార్గం ద్వారా వస్తున్న వారికి కరోనా లక్షణాలు ఉంటేనే అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కి తరలిస్తామని, ఆ లక్షణాలు లేనివారు నేరుగా ఇంటికి వెళ్లవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కానీ ప్రతీ ఒక్కరూ స్వీయ రక్షణ పాటించాలని కోరారు. హోమ్ క్వారంటైన్‌లో ఉండే ప్రతి ఒక్కరినీ పరిశీలనలో ఉంచుతామని, వైద్యారోగ్య సిబ్బంది వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని తెలిపారు. ఎవరికి లక్షణాలు కనిపించినా ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణీకులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అధికారులు కూడా ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే తగిన విధంగా వ్యవహరిస్తారని తెలిపారు. డాక్టర్స్ సూచించిన యాప్ డౌన్ లోడ్ చేసుకొని వైద్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలపై సంబంధిత అధికారులతో మంత్రి ఆదివారం సమీక్షించారు. రాష్ట్రానికి వస్తున్న విదేశీయులు ఇకమీదట కేవలం ఏడు రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంటే చాలని కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి వాటిని పాటిస్తామన్నారు. ఆ తర్వాత మరో ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలన్న సూచనను కూడా అమలుచేస్తామన్నారు. విదేశాలనుండి వచ్చే గర్భిణులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, కుటుంబ సభ్యులు చనిపోయిన సందర్భంగా వచ్చేవారిని నేరుగా హోమ్ క్వారెంటైన్‌కి తరలించవచ్చు అని తెలిపిందని, తెలంగాణ రాష్ట్ర అభ్యర్థన మేరకే ఈ మార్పులు జరిగినందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.