బ్యాచిలర్ రూమ్స్ టార్గెట్ చేసిన యువకుడు.. విచారణలో షాకింగ్ నిజాలు

by Shyam |   ( Updated:2021-11-05 23:24:27.0  )
బ్యాచిలర్ రూమ్స్ టార్గెట్ చేసిన యువకుడు.. విచారణలో షాకింగ్ నిజాలు
X

దిశ, జడ్చర్ల : మొన్నటిదాకా జైలు జీవితం గడిపి తిరిగి మరో మారు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు ఓ నిందితుడు. జడ్చర్ల పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ రమేష్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు.

జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లి తండా‌కు చెందిన శివ ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు ఉదయం జడ్చర్ల పట్టణంలో సెల్‌ఫొన్ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతడిని తమదైన శైలిలో పోలీసులు విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాను పట్టణంలో కేవలం బ్యాచిలర్స్ రూములలోనే సెల్‌ఫొన్‌లు ఎత్తుకెళ్లే వాడినని తెలిపారు. ఇలా ఎత్తుకెళ్లిన సెల్‌ఫొన్‌ను సమీపంలో దివిటీ పల్లి గ్రామానికి చెందిన వెంకట్ రాములు అనే వ్యక్తికి విక్రయించే వాడినని పోలీసులకు తెలిపాడు. దీంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు. కాగా, జల్సాలకు అలవాటు పడ్డ శివప్రసాద్ గతంలో పలు చోరీలకు పాల్పడుతూ జైలు జీవితం గడిపి ఇటీవలే విడుదల అయ్యాడని తాజాగా మరోమారు చోరీకి పాల్పడుతూ పట్టుబడ్డాడన్నారు. అంతేకాకుండా అతడి నుండి 49 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story