- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరిక్షంలో ఎలుకల వీర్యం.. ఒకేసారి 168 పిల్లలకు జననం..?
దిశ, ఫీచర్స్ : ఎలుకల వీర్యాన్ని ఫ్రీజ్-డ్రైడ్ రూపంలో ఆరేళ్ల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)లో స్టోర్ చేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టనున్నాయని తాజా స్టడీ పేర్కొంది. ఈ క్రమంలో వీర్యాన్ని అధిక స్థాయి కాస్మిక్ రేడియేషన్‌కు గురిచేస్తే.. ఊహించనంత పెద్ద ఎత్తున సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయని జపనీస్ రీసెర్చర్స్ వెల్లడించారు. ఈ స్టడీ ‘సైన్స్ అడ్వాన్సెస్’లో ప్రచురితం కాగా.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఫ్రీజ్-డ్రైడ్ రూపంలో స్టోర్ చేయబడిన ఎలుకల వీర్యాన్ని భూమి మీదకు తీసుకొచ్చి రీహైడ్రేట్ చేస్తే ఎటువంటి జన్యులోపాలు లేని 168 పిల్లలు పుట్టినట్టు తెలిపింది.
స్పేస్ స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందిన ఎలుకలకు, భూగ్రహానికే పరిమితమైన వీర్యంతో పుట్టిన వాటికి కొద్దిపాటి తేడా ఉంటుందని డెవలప్‌మెంట్ బయాలజిస్ట్, లీడ్ ఆథర్ తెరూకో వకయామ వెల్లడించారు. అయితే అన్ని పిల్లలు నార్మల్‌గానే కనిపించాయని, జన్యుపరంగానూ ఎటువంటి లోపాలు లేవని తెలిపారు. 2013లో జపాన్‌లోని యమనాషి యూనివర్సిటీలో వకయామ, తన బృదం.. లాంగ్ టర్మ్ స్టడీ కోసం ఒక్కో దాంట్లో 48 ఫ్రీజ్-డ్రైడ్ స్పెర్మ్ సీసాలను కలిగిఉన్న మూడు బాక్సులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. ఆ తర్వాత వీటిని మూడు బ్యాచ్‌లుగా భూమి మీదకు తీసుకొచ్చారు.
మొదటి బ్యాచ్‌ను తొమ్మిది నెలలకు తీసుకురాగా, రెండో బ్యాచ్‌ను రెండు సంవత్సరాల తర్వాత, మూడో బ్యాచ్‌ను ఏకంగా ఆరు సంవత్సరాలకు తీసుకొచ్చారు. స్పేస్‌లో దీర్ఘకాలికంగా రేడియేషన్‌కు గురికావడం వల్ల పునరుత్పత్తి కణాల్లో డీఎన్‌ఏ దెబ్బతింటుందా లేదా సంతానంతో పాటు ఉత్పరివర్తనాలను కూడా పాస్ చేస్తుందో లేదో తెలుసుకోవడమే ఈ ప్రయోగ లక్ష్యం. కాగా హీన్ లీన్, అసిమోవ్‌ల సైన్స్ ఫిక్షన్ స్టోరీతో స్ఫూర్తిపొంది ఈ స్టడీ చేపట్టినట్టు వకాయామ తెలిపాడు.
భవిష్యత్తులో హ్యూమన్స్ ఇతర గ్రహాలకు వెళ్లాల్సి వచ్చినపుడు.. మనుషులతో పాటు పెంపుడు జంతువుల విషయంలోనూ జెనెటిక్ డైవర్సిటీని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని తమ స్టడీలో పేర్కొన్నారు. ఖర్చు, భద్రతా కారణాల దృష్ట్యా.. స్పేస్ షిప్స్ ద్వారా సజీవ జంతువులను తీసుకెళ్లే బదులు నిల్వ చేసిన సూక్ష్మక్రిమి కణాలను తీసుకెళ్లేందుకు ఈ విధానం సాయపడుతుందని స్పష్టం చేశారు.