- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాహనదారులు బీ అలర్ట్.. పొగమంచుతో జర భద్రం
దిశ, డైనమిక్ బ్యూరో : చలికాలం వచ్చిందంటే చాలు.. రాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు పొగ మంచు కప్పేస్తుంటుంది. ఈ పొగమంచు కారణంగా పది మీటర్ల దూరంలో ఉన్న వస్తువు కూడా కనిపించదు. మిగతా సమయంలో అంతగా ఫాగ్ ఉండదు. కానీ చలికాలంలో డ్రైవింగ్ చేసేవారు ఫాగ్ లైట్లు వాడినా ప్రమాదకరంగానే ఉంటుంది. అందుకే ఈరోజుల్లో అధికంగా ప్రమాదాలు జరుతుంటాయి.
ఈ సమయంలో వాహనానికి, వాహనానికి 20 నుంచి 30 మీటర్ల దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. అంతేకాకుండా, ఓవర్ టేక్ చేయకపోవడమే మంచిది. కానీ, మహారాష్ట్రలోని ధూలేలో బిజాసాని ఘాట్ వద్ద ముంబై-ఆగ్రా హైవేపై బుధవారం రాత్రి ఓ వాహనం మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా భారీ ప్రమాదం జరిగింది. దీంతో వెనుక వచ్చే వాహనాలు ప్రమాదాన్ని గ్రహించకపోవడంతో ఒకదాని వెనుక మరొకటి ఇలా ఏడెనిమిది వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి తీవ్రంగా గాయలయ్యాయని పోలీసులు వెల్లడించారు.