మోటోరోలా నుంచి బడ్జెట్ ఫోన్

by vinod kumar |
మోటోరోలా నుంచి బడ్జెట్ ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్‌:
లాక్‌డౌన్‌ 4.0లో సడలింపులు ఇవ్వడంతో మొబైల్ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్లను వరసగా విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మోటోరోలా తన మోటో జీ8 పవర్‌లైట్ స్మార్ట్ ఫోన్‌ను గురువారం భారత్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో రానుంది. ట్రిపుల్ రేర్ కెమెరా, అద్భుతమైన డిజైన్‌తో రెండు భిన్నమైన రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ మే 29న ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫస్ట్ సేల్‌కు రానుంది. మోటో బడ్జెట్ ధరలో రూపొందించిన ఈ ఫోన్‌.. రెడ్‌మీ 8, రియల్‌మీ సీ3, రియల్‌మీ నర్జో 10ఏ, వీవో వై11 వంటి బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మోటో జీ8 పవర్ లైట్ ఫీచర్స్ :

డిస్‌ప్లే : 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ
స్టోరేజ్ : 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్ ,
ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో పీ35
ఓఎస్ : ఆండ్రాయిడ్ 9 పై
కెమెరా : 16+2+2 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా
ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సెల్
కలర్స్ : ఆర్కిటెక్ బ్లూ, రాయల్ బ్లూ కలర్
ధర : రూ. 8999/-

ఆఫర్ : యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొంటే.. 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎమ్ఐ సౌకర్యాన్ని కూడా పొందొచ్చు.

Advertisement

Next Story

Most Viewed