- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుమారుడు హత్య.. తల్లి ఆత్మహత్య
దిశ, ఎల్బీనగర్, మునుగోడు: మనస్థాపానికి గురైన ఓ తల్లి, కుమారుడి హత్యచేసి అనంతరం అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం, వర్కట్పల్లి గ్రామానికి చెందిన గులాం శంకరయ్యతో మమత(25)కు 2012లో వివాహం చేశారు. శంకరయ్య, కుటుంబసభ్యులతో కలిసి ఎల్బీనగర్, శాతావాహన కాలనీలోని ఓ అపార్ట్మెంట్‌లో నివాసముంటున్నారు. శంకరయ్య స్థానికంగా బ్యాటరీల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఓ కుమారుడు రేయన్స్(03) దృష్టి లోపంతో జన్మించాడు. రేయన్స్ వైద్యం కోసం తల్లిదండ్రులిద్దరూ పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టారు. అయినప్పటికీ బాబుకు నయం కాకపోవడంతో మమతను అత్తగారింటి వైపు బంధువులు వేధించసాగారు. దీంతో మానసికంగా కుంగిపోయిన మమత సోమవారం రాత్రి కుమారుడు రేయన్స్ కుడిచేయి మణికట్టు వద్ద కత్తితో కోసి బెడ్రూమ్‌లో పడేసింది. అనంతరం రాత్రి భర్త శంకరయ్య ఇంటికి రాగానే మమత అపార్ట్మెంట్ పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బెడ్రూంలో అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసిన తండ్రి శంకరయ్య వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే రేయన్స్ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్మెంట్లో ఒకేసారి తల్లికుమారుడు మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.