- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడేళ్ల చిన్నారిని చంపిన తల్లి.. మూడో కంటికి తెలియకుండా..!
దిశ, వెబ్డెస్క్ : కొన్ని వివాహేతర సంబంధాలు తల్లి ప్రేమను మసకబారేలా చేస్తున్నాయి. పేగు తెంచుకుని పుట్టిన కన్న బిడ్డలను కడతేర్చేంత దుర్మార్గానికి ప్రేరేపిస్తున్నాయి. కొద్దిరోజుల పరిచయానికే నవ మాసాలు కడుపులో పెట్టుకుని జన్మనిచ్చిన చిన్నారులను సైతం దూరం చేసుకుంటున్నారు కొందరు తల్లులు. ఇదంతా వారి సాన్నిహిత్యానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వివాహేతర సంబంధాల ముసుగులో అనేక ఘోరాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ వివాహిత భర్తకు దూరంగా ఉంటూ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఆమెకు మూడేళ్ల చిన్నారి కలదు. అయితే, తన వివాహేతర సంబంధానికి అడొస్తున్నదని భావించిన తల్లి ఎవరూ లేని సమయంలో చిన్నారిని హతమార్చి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్టణం జిల్లా మధురవాడలోని మారికవలసలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. చుట్టుపక్కల స్థానికులు పాప గురించి ఆరా తీయగా సంబంధం లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో వారు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం స్థానికులు ఆమెకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.