- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చాంద్రాయణగుట్టలో తల్లీ-కొడుకుల మిస్సింగ్ కలకలం
by Sumithra |

X
దిశ, చార్మినార్: అనుమానాస్పద స్థితిలో తల్లీ, కొడుకులు అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్పరిధిలో జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్మాయిల్‌నగర్‌కు చెందిన ముంతాజ్ బేగం, అల్లాబక్ష్‌లు దంపతులు. దీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. చిన్న కుమార్తె ఇష్రత్ బేగం(28), ఆమె కుమారుడు ఫర్హాన్(10)లు గత కొంత కాలంగా తల్లి దండ్రుల వద్దనే ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 1గంటలకు కూతురు ఇష్రత్, మనువడు ఫర్హాన్‌లు కనిపించలేదు. వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల బంధువుల ఇళ్ళలో వెతికినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో ముంతాజ్ బేగం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story