రోడ్డు ప్రమాదానికి బలైన తల్లీకొడుకులు 

by Sumithra |
రోడ్డు ప్రమాదానికి బలైన తల్లీకొడుకులు 
X

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రామ్ నగర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తల్లీ కొడుకు ప్రాణాలు విడిచారు. వివరాల ప్రకారం… నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బైరాపురం గ్రామానికి చెందిన తల్లీ కొడుకులు బైక్ మీద వెళుతున్నారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించింది హరీష్ కుమార్ (18), అలివేలు(40) గా పోలీసులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story