పుట్టింటికి పంపించలేదని కుమారుడితో సహా..

by Sumithra |   ( Updated:2021-06-25 10:38:45.0  )
Missing wife, son
X

దిశ, జవహర్ నగర్: తల్లిగారింటికి పంపించనందుకు కొడుకుతో పాటు ఓ తల్లి అలిగి వెళ్లిపోయిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేషన్ పరిధిలోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీకి చెందిన ఇరుకుల సతీష్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ భార్య శమంతకమణి (27), ఇద్దరు కుమారులు సుశాంత్ కుమార్ (6), వార్షిత్ కుమార్ (4)లతో కలిసి నివాసముంటున్నాడు. గత కొన్ని రోజులుగా శమంతకమణి అనారోగ్యంతో బాధపడుతూ, తన తల్లిగారింటికి వెళ్తానని సతీష్ కుమార్ అడుగుతోంది.

ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం శమంతకమణి తన చిన్న కుమారుడు వార్షిత్ కుమార్‌ను తీసుకుని, పక్కింట్లో ఉన్న ఆమె అత్త విజయకు బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోయే సరికి బంధువులను, చుట్టుపక్కల వారిని వారి ఆచూకీ కోసం వాకాబు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సతీష్ కుమార్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story