- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతిపెద్ద స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోడీ పేరు
దిశ, స్పోర్ట్స్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో మొతేరాలో నిర్మించిన అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య పింక్ టెస్ట్ మొదలు కావడానికి ముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలసి రాష్ట్రపతి ప్రారంభించారు. ఇప్పటి వరకు సర్దార్ పటేల్ స్టేడియంగా పిలిచిన ఈ స్టేడియంను ఇకపై నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు మారుస్తున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేశారు. అందుకే ఆయన పేరు పెడుతున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. 63 ఎకరాల్లో రూ. 800 కోట్ల అంచనాతో నిర్మించిన ఈ స్టేడియంలో 1.32 లక్షల మంది కూర్చునే సామర్థ్యం ఉన్నది. మ్యాచ్ ముందు వందవ టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సత్కరించారు.