- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భాగ్యనగరంలో బంగారు దొంగ చిక్కాడు
దిశ, క్రైమ్ బ్యూరో : భాగ్యనగరంలో బంగారు దొంగ కథ వింటే అందరూ షాక్ అవ్వాల్సిందే. సాధారణంగా ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వారి ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ, ఈ దొంగ మాత్రం డిఫరెంట్. అదే సమయంలో దొంగతనమే ఓ ఉద్యోగంగా మార్చుకున్నాడు. అందిన కాడికి దోచుకోవడం దొంగల స్పెషలిటీ అయితే, కేవలం బంగారాన్ని మాత్రమే ఎత్తుకెళ్లడం పనిగా పెట్టుకున్నాడు. కానీ, చివరకు అతడి వినూత్న ప్రయోగమే కటకటాలలోకి నెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 దొంగతనాలకు పాల్పడిన ఇతడు బంగారం మాత్రమే దోచుకెళ్లాడు. ఈ ఆధారాలను పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 1040 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఇతగాడి నేరచరిత్ర పోలీసులు వివరిస్తుంటే సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కేవలం ఒక స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, చిన్న రాడ్డు, టెస్టర్‌లనే ఆయుధాలుగా మార్చుకున్న ఇతడు ఎంతో మంది ఇండ్లల్లో ఒంటరిగానే చొరబడి దొంగతనాలు చేశాడు. దోచుకున్న వాటిని దాచిపెట్టుకొని..చివరకు పోలీసులకు కట్టబెట్టి ఇప్పుడు తలపట్టుకున్నాడు.
బంగారు దొంగ వివరాళ్లోకి వెళితే..
హైదరాబాద్ టోలిచౌకి పారమౌంట్ ప్రాంతానికి చెందిన ఖాజమ్ అలీ ఖాన్(అలియాస్ సూర్యా అన్న) దొంగతనాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు. ఇంట్లో 10 మంది సంతానం కావడంతో కష్టపడితే సంసారం సాగదని భావించి ఈజీ మనీ స్కీమ్‌ను అవలంభించాడు. అయితే, తన 16వ ఏటనే క్రైమ్ ఫీల్డ్‌లోకి వచ్చాడు. తన తండ్రితో ఓ ఫంక్షన్ హాల్‌లో పనికి కుదిరిన ఎక్కువ కాలం అందులో కొనసాగలేకపోయాడు. ఇక దొంగతనమే మేలని భావించి పక్కా పథకం వేసుకున్నాడు. ఇందుకోసం నగరశివారుల్లోని ఇండిపెండెంట్ ఇండ్లు, అపార్ట్‌మెంట్లను టార్గెట్ చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది, వాచ్‌మెన్‌లతో స్నేహం పెంచుకొని ఎలక్ట్రిషన్‌ను అంటూ ప్రగల్భాలు పలికాడు. ఆ తర్వాత ఇంటి యజమానుల పనులు చేస్తూ నమ్మకం కలిగించేవాడు. ఆ తర్వాత వారు ఉద్యోగాలకు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకొని ఇంట్లోకి చొరబడేవాడు. కంటి ముందు ఉన్న వెండి, ఇతర విలువైన వస్తువులను మోయడం ఇబ్బంది అని గ్రహించి.. కేవలం బంగారాన్ని మాత్రమే జేబులో వేసుకునే వాడు. ఇలా దాదాపు 70 చోరీలు చేశాడు. అందులో మొత్తం బంగారాన్నే అపహరించాడు.
2015 నుంచి 2020 వరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ పరిధి కమిషనరేట్‌ల్లో చోరీలు చేశాడు. ఒక్కోసారి ఒక ఇంట్లో దొంగతనం విఫలం అయితే, సంతృప్తి కోసం మరో ఇంటిలో చోరీలు చేసేవాడు. రోజుకో బైక్‌ను మార్చుతూ.. తలకు హెల్మెట్, మాస్కులతో జాగ్రత్త పడేవాడు. కానీ, చేసిన ప్రతీ చోట కేవలం బంగారం మాత్రమే ఎత్తుకెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు దొంగతనాలకు పాల్పడింది ఖాజమ్ అని గుర్తించి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సీపీ సజ్జనార్ మీడియా ముందు ప్రవేశపెట్టారు.
బ్యాంకు లాకర్లే భద్రం: సీపీ సజ్జనార్
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ తర్వాత శంషాబాద్, రాయదుర్గం, నార్సింగి, చేవెళ్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనం కేసులు నమోదు కావడంతో ప్రత్యేక నిఘా వేశామన్నారు. శంషాబాద్ సీసీఎస్, శంషాబాద్ ఎస్ఓటీ, నార్సింగి పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో విశ్వాసనీయ సమాచారంతోనే ఖాజమ్ అలీని అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుడి నుంచి 1040 గ్రాముల బంగారంతో పాటు నాలుగు బైక్‌లు, రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనికి తోడు మొత్తం రూ.52 లక్షల విలువ చేసే వస్తువులు కూడా గుర్తించామన్నారు. ఇక మీదట ఇంట్లోని విలువైన సామాగ్రిని బ్యాంకు లాకర్లలో పెట్టుకోవడం మంచిదని సజ్జనార్ ప్రజలకు సూచించారు. లేనిపక్షంలో పటిష్టమైన లాక్ సీస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.