- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీటికి కూడా లాక్డౌన్
దిశ, వెబ్ డెస్క్: లాక్డౌన్ విధించి అప్పుడే 40 రోజులు దాటాయి. చాలామంది ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కు అలవాటు పడ్డారు. లాక్డౌన్ పొడగింపుతో మరో రెండు వారాల పాటు సేమ్ లైఫ్ స్టైల్ కంటిన్యూ కావాల్సిందే. లాక్డౌన్ కు ముందు మనం ప్రతి రోజూ ఉపయోగించిన కొన్నింటిని ఈ క్వారంటైన్ టైమ్ లో దూరం పెట్టాము. వాటి అవసరమే రాకుండా పోయింది.
లాక్డౌన్ కు ముందు ఉద్యోగులకు, విద్యార్థులకు ఒక టైమ్ షెడ్యూల్ ఉంటుంది. ఆఫీసు, స్కూలు, కాలేజీలకు వెళ్లడానికి ఫార్మల్ గా రెడీ అయి.. బయలుదేరుతుంటాం. ఇప్పుడంతా మారిపోయింది. హ్యాంగర్ కు తగిలించిన చొక్కాలు, చెప్పులు స్టాండులోని చెప్పులు మన వైపు దీనంగా చూస్తున్నాయి. ఇవే కాదు అలా క్వారంటైన్ పీరియడ్ లో కొన్నింటిని మనం వాడటం లేదు.
ఫార్మల్ క్లాత్స్:
చాలా మంది ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నారు. విద్యార్థులందరూ కూడా ఇంటికే పరిమితమయ్యారు. దాంతో ఎవరికీ కూడా ఫార్మల్ క్లాత్స్ ఉపయోగించే పని లేకుండా పోయింది. వార్డ్ రోబ్ లో, షెల్ప్ లో ఫార్మల్ డ్రెస్ లన్నీ భద్రంగా ఉండిపోయాయి. ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ ముందరేసుకుని, నైట్ ప్యాంట్, ఓ టీ షర్ట్ తో పని కానిచ్చేస్తున్నారు.
ఫార్మల్ షూస్:
వీటికి కూడా సెలవులు వచ్చేశాయి. మరో రెండు వారాల పాటు అవి స్టాండ్స్ లోనే ఉండిపోతాయి. ఆఫీసులు, ఇంటర్య్వూలు, కాలేజీలు ఏవీ లేకపోవడంతో ఫార్మల్ షూ స్ కు విశ్రాంతి దొరికాయి. అంతకుముందు ఫార్మల్ డ్రెస్ తో పాటు.. ఫార్మల్ షూ పక్కా ఉండాల్సిందే.
ఐరన్:
నెల రోజుల పై నుంచి .. ఉతికిన బట్టలు అలానే వాటి పరిమళం కోల్పోకుండా ఉన్నాయి. క్వారంటైన్ టైమ్ లో అందులోంచి ఒక్క షర్ట్ అయినా బయటకు తీసి ఐరన్ చేయాల్సిన అవసరం వస్తే కదా. మనతో పాటు దుస్తులు, ఐరన్ బాక్స్ లు కూడా లాక్డౌన్ లోనే ఉన్నాయి.
మేకప్:
మనం చర్మాన్ని రక్షించుకోవడానికి క్వారంటైన్ అసలైన సమయంగా చెప్పొచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడంతో.. దుమ్ము, ధూళిలతో పాటు కాలుష్యం చర్మాన్ని తాకకుండా ఉంటోంది. సూర్య కిరణాలు కూడా తాకడం లేదు. ఇలాంటి తరుణంలో మేకప్ కూడా ఉపయోగించే అవసరం లేకుండా పోయింది. దాంతో చర్మం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోంది. దీని వల్ల చర్మం కాంతులీనడంతో పాటు సరికొత్త జీవం పోసుకుంటుంది. అసలే ఇది సమ్మర్ టైమ్. మరి ఈ టైమ్ లో బయటకు వెళ్లేది లేదు కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ రాయాల్సిన అవసరం లేదు.
లంచ్ బాక్స్:
ఆఫీసులో ఆనందంగా గడిపే క్షణాలు ఉన్నాయంటే.. అవి లంచ్ తినే సమయమే అని చాలా మంది చెబుతుంటారు. అందరూ ఒక చోట చేరి .. ముచ్చట్ల చెప్పుకుంటూ కడుపు నిండా తినేస్తారు. ఒకరి కూరలను, మరొకరు షేర్ చేసుకుంటూ మూడు నాలుగు వంటకాలతో తృప్తిగా తినేస్తారు. కానీ లాక్డౌన్ లంచ్ బాక్స్ కు విశ్రాంతినిచ్చింది.
ల్యాప్ టాప్ బ్యాగ్, పర్ ఫ్యూమ్, సన్ గ్లాసెస్, పవర్ బ్యాంక్స్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ వీటిని కూడా ఈ లిస్టులో చేర్చొచ్చు.
tags: coronavirus, lockdown, laptop, formal clothes, iron