విదేశాలకు వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి

by Harish |   ( Updated:2020-06-14 05:05:13.0  )
విదేశాలకు వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి
X

ముంబయి: మీడియా సంస్థ మింట్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో విదేశీ, దేశీయ యువత అభిరుచులపై ఆసక్తికర విషయాలు తెలిశాయి. అమెరికా యువత ఎక్కువగా అప్పులు చేస్తూ, తక్కువ ఆదాయాన్ని, ఆస్తులను కలిగి ఉన్నారని తేలింది. అయితే, భారతీయ యువత మెరుగైన ఆదాయాన్ని కలిగి ఉన్నారని స్పష్టమైంది.

2020 మార్చి 12 నుంచి ఏప్రిల్ 2 మధ్య మొత్తం 184 పట్టణాల్లో మింట్-సీపీఆర్ సంయుక్తంగా ఆన్‌లైన్‌లో ఈ సర్వే చేసింది. సర్వేలో పాల్గొన్న 10,005 మందిలో 4,957 మంది 22 నుంచి 37 ఏళ్ల వయసు వారైతే(మిలినియల్స్ ), 2,983 మంది 1996 ఏడాది తర్వాత జన్మించిన వారు(పోస్ట్ మిలీనియల్స్) ఉన్నారు. 2,065 మంది 40 ఏళ్ల వయసుపై బడిన వారు(ప్రీ-మిలీనియల్స్) తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మన దేశంలోని యువతలో చాలామంది ఇతర నగరాలకు, విదేశాలకు వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నట్టు సర్వే తేలింది. సర్వేలో పాల్గొన్న యువతలో ఎక్కువ మంది లక్షకు పైగా జీతాన్ని సంపాదిస్తున్నట్టు, అద్దె ఇంట్లో ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు, ఆర్థికంగా నిలదొక్కుకున్నాకే సొంత ఇంటికి కల గురించి ఆలోచిస్తామని మెజారిటీ యువత స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed