జూన్‌ 19న వచ్చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’

by Shyam |
జూన్‌ 19న వచ్చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’
X

దిశ, సినిమా : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఇప్పటికే రిలీజైన హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్, టీజర్, మనసా మనసా సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అఖిల్ కెరియర్‌లో బెస్ట్ మూవీగా నిలిచే చాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. చిత్రం విడుదల తేదీని ప్రకటించింది మూవీ యూనిట్. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న చిత్రాన్ని జూన్ 19న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్‌ చేశారు. ఈ సందర్భంగా అఖిల్, పూజల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.

Advertisement

Next Story