తెలంగాణలో 50 వేలు దాటిన కేసులు

by Anukaran |   ( Updated:2020-07-23 10:44:33.0  )
తెలంగాణలో 50 వేలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. రోజురోజుకీ వేయికి పైగా కేసులు నమోదు అవుతూ.. వైరస్ కొరలు చాస్తోంది. గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా 1567 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,826కే చేరింది. ఈ రోజు వైరస్ కారణంగా 9 మంది మృతి చెందగా.. మొత్తం 447 మరణాలు నమోదు అయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 1,661 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 39,327 మంది హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు 77.3 శాతం మంది వైరస్ నుంచి కోలుకున్నారని.. 21.7 శాతం మంది బాధితులు చికిత్స పొందుతున్నారని.. ఒక్క శాతం మాత్రమే మరణాల రేటు ఉందని వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో స్పష్టం చేసింది.

Advertisement

Next Story