తెలంగాణలో 30వేలకు పైగా యాక్టివ్ పాజిటివ్‌లు

by  |
తెలంగాణలో 30వేలకు పైగా యాక్టివ్ పాజిటివ్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొత్తం రికవరీ పేషెంట్ల సంఖ్య ఒకటిన్నర లక్ష మార్కు దాటింది. ఇప్పటివరకు మొత్తం 1.81 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో 1.50 లక్షల కేసులు రికవర్ అయినట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్ పేర్కొంది. రికవరీ విషయంలో జాతీయ సగటుతో (81.71%) పోలిస్తే తెలంగాణలో కాస్త ఎక్కువగానే (82.67%) ఉంది. గడచిన 24 గంటల వ్యవధిలో 2,381 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా 2,021 మంది క్షేమంగా ఇళ్ళకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇంకా 30 వేలకు పైగా యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇందులో సుమారు పాతిక వేల మంది ప్రభుత్వ, హోమ్ ఐసొలేషన్‌లోనే ఉన్నారు. పాజిటివ్ పేషెంట్లలో దాదాపు సగం మంది 21-40 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్నవారే. మొత్తం పాజిటివ్ కేసుల్లో మహిళలు దాదాపు 40% మేర ఉన్నారు. తాజాగా 10 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 1,080కు చేరుకుంది.

హైదరాబాద్ నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ప్రతీరోజు 300 కంటే కొంచెం మాత్రమే ఎక్కువగా ఉండే కేసులు శుక్రవారం మాత్రం దాదాపు 400కు చేరువగా నమోదయ్యాయి. కరీంనగర్, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో మాత్రం వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సైతం ఇప్పటికీ వందల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి.


Next Story

Most Viewed