- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ -కేవీ సుబ్రమణియన్
దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి దేశంలో ప్రపంచస్థాయి బ్యాంకులు అవసరమని ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ చెప్పారు. బంధన్ బ్యాంక్ ఐదవ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. టాప్ 100 గ్లోబల్ బ్యాంకుల జాబితాలో భారత్‌కు ఒకే ఒక బ్యాంకు మాత్రమే ఉందని, పరిమాణంలో చాలా చిన్నగా ఉన్న దేశాల్లో కూడా ఒక్కో ప్రపంచ స్థాయి బ్యాంకు ఉందని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు.
గ్లోబల్ టాప్ 100 జాబితాలో దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 55వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో చైనాకు చెందినవి 18 బ్యాంకులు, అమెరికాకు చెందినవి 12 బ్యాంకులు ఉన్నాయి. ‘భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ, దీనికి అనుగుణంగా భారత బ్యాంకింగ్ రంగం లేదని, ప్రపంచ టాప్ 100 జాబితాలో దక్షిణ కొరియా దేశానికి చెందిన ఆరు బ్యాంకులు ఉంటే, మనదేశంలో ఒక్కటి మాత్రమే ఉందన్నారు. ఇంకా, భారత పరిమాణంలో చాలా చిన్న భాగమైన దేశాలు ఫిన్‌లాండ్, డెన్మార్క్, బెల్జియం, ఆస్ట్రియా, నార్వే దేశాల్లో ప్రపంచ టాప్ 100లో కనీసం ఒక బ్యాంకును కలిగి ఉన్నాయి.
స్వీడన్, సింగపూర్ వంటి దేశాలను పరిశీలిస్తే.. స్వీడన్ ఆర్థిక వ్యవస్థ మనదేశంతో పోలిస్తే ఆరవ వంతు ఉండగా, సింగపూర్ ఆర్థిక వ్యవస్థ ఎనిమిదవ పరిమాణంలో ఉంది. కానీ, ప్రపంచ టాప్ 100లో ఇరు దేశాల నుంచి మూడు బ్యాంకుల చొప్పున ఉన్నాయని సుబ్రమణియన్ పేర్కొన్నారు. అభివృద్ధి క్రమంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. రానున్న రోజుల్లో భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచస్థాయిలో సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాంకుల సంఖ్య పరంగా ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత్ తన ఉనికిని పెంచుకోవాలి. సంఖ్య పరంగా ఇప్పటికే ఈ వరుసలో అగ్రస్థానాల్లో ఉన్న చైనా, అమెరికా దేశాల బ్యాంకింగ్ వ్యవస్థలతో మనం పోటీపడాలని చెప్పారు.
సాంకేతికతపై కూడా దృష్టి పెట్టాలి…
ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగం సరైన లక్ష్యాన్ని రూపొందించుకోవాలి. ఎందుకంటే… భారత్ రానున్న రోజుల్లో చిన్న ఆర్థిక వ్యవస్థ కాదని, ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అని ఆయన అన్నారు. కాబట్టి, భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు బ్యాంకింగ్ రంగం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణానికి తగినట్టుగా మారాలి. ప్రపంచ పరిమాణానికి తగిన బ్యాంకులతో పాటు, మరిన్ని బ్యాంకులు అవసరమని సుబ్రమణియన్ తెలిపారు.
ఇంకా వివరంగా చెప్పాలంటే.. జనాభా పరంగా భారత్‌లో మూడింట ఒక వంతుకు సమానమైన అమెరికా 20 రెట్లు ఎక్కువ బ్యాంకులను కలిగి ఉంది. మరిన్ని బ్యాంకులు రానున్నాయి. దీనివల్ల వినియోదారుల ఖర్చులు తగ్గనున్నాయన్నారు. అలాగే, ఇటీవల బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించేందుకు ప్రాధాన్యతనిస్తూ.. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. సాంకేతికత రుణాల నాణ్యత అంశంలో కీలక పాత్ర పోషించనుంది. డేటా అనలిటిక్స్, టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉద్దేశపూర్వక ఎగవేతదారుల తప్పుడు వివరాలను పరిశీలించడం సులభమవుతుందని సుబ్రమణియన్ తెలిపారు.