కొట్టుకుపోయిన మూసారంబాగ్ బ్రిడ్డి ఫెన్సింగ్..

by Shyam |   ( Updated:2020-10-14 01:51:18.0  )
కొట్టుకుపోయిన మూసారంబాగ్ బ్రిడ్డి ఫెన్సింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రహదారులపై నీళ్లు ప్రహహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే మూసారాంబాగ్ బ్రిడ్జి రెండు వైపులా ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది.

సమాచారం తెలియడంతో రాష్ట్ర మంత్రులు కె.తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్ మూసారాం బాగ్ ప్రాంతాన్ని సందర్శించారు. అనంరతం ప్రమాదాల నివారణకు రెండు వైపులా బారికేడింగ్, పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story