- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మంలో అమానుషం.. బాకీ తీర్చలేదని భార్యను ఎత్తుకెళ్లాడు
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. అప్పు తీర్చలేదని ఓ వడ్డీ వ్యాపారి ఏకంగా రుణగ్రస్తుడి భార్యను ఎత్తుకెళ్లాడు. లాక్‌డౌన్ సమయంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని సులానగర్‌లో అజ్మీరా హట్యా కుటుంబంతోపాటు జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బానోత్ హన్మా అనే వడ్డీ వ్యాపారి వద్ద నుంచి రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రూ. 1.50 లక్షలు తిరిగి చెల్లించగా, ఇంకా రూ. 50 వేలు చెల్లించాల్సి ఉంది. లాక్‌డౌన్ అమలులో ఉండటంతో మిగిలిన అసలు, వడ్డీ చెల్లించేందుకు అజ్మీరా గడువు కోరాడు. ఇందుకు హన్మా అంగీకరించకుండా మొండి వైఖరి అవలంబిస్తూ అప్పు మొత్తం తీర్చాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అజ్మీరాపై దాడి చేయడమే కాకుండా అడ్డు వచ్చిన అతడి భార్యను హన్మా తనతోపాటు తీసుకెళ్లాడు. ఇంట్లో నిర్బంధించాడు. దీంతో
అజ్మీరా పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Tags: Crime, moneylender, Kidnapped, Borrower’s Wife, Bhadradri Kothagudem