- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భాగ్యనగరంలోని భవనాలపై ‘మనీ హీస్ట్’ పెయింటింగ్స్!
దిశ, ఫీచర్స్ : మోస్ట్ సక్సెస్‌ఫుల్ థ్రిల్లర్ సిరీస్ ‘మనీ హీస్ట్’ వరల్డ్ వైడ్‌గా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు ఎన్నో కంపెనీలు ఈ షో థీమ్, పోస్టర్స్, పాటలను తమదైన శైలిలో వాడుకున్నాయి. అంతేకాదు సిరీస్‌లోని నటుల ముఖ చిత్రాలను ఆకాశ హర్మ్యాలపై చిత్రించాయి. ఇప్పుడు ఈ తరహా కుడ్య చిత్రాలు ముంబైతో పాటు హైదరాబాద్‌లోనూ మనీహీస్ట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి.
‘సుపారీ స్టూడియోస్’ అనే ఏజెన్సీ బాలీవుడ్ ఆర్ట్ ప్రాజెక్ట్‌తో కలిసి ‘మనీ హీస్ట్’ కుడ్యచిత్రాలను హైదరాబాద్, ముంబై నగరాల్లోని ఎత్తైన భవనాలపై చిత్రించింది. ఈ మేరకు సంబంధిత చిత్రాలను భాగ్యనగరంలోని నెక్లెస్ రోడ్ MMTS స్టేషన్, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో చూడొచ్చు. ఇక ముంబై విషయానికొస్తే.. హిల్ రోడ్, సెయింట్ ఆండ్రూ చర్చి, బాంద్రా రిక్లమేషన్ MTNL బిల్డింగ్ దగ్గర ఈ వాల్ పెయింటింగ్స్ చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీకి చెందిన మ్యూరల్ ఆర్టిస్ట్ యంత్ర్‌తో పాటు BAP కళాకారులు రూపొందించిన ఈ కళాకృతి సుమారు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ పెయింటింగ్ పూర్తి చేసేందుకు 10 రోజుల సమయం పట్టినట్లు కళాకారులు తెలిపారు.
‘2014లో, MTNL భవనంపై దాదాసాహెబ్ ఫాల్కే కుడ్యచిత్రాన్ని చిత్రించాను. ఈసారి ‘మనీ హీస్ట్’ కుడ్యచిత్రాన్ని గీసేందుకు మాకు అనుమతి లభించింది. ఇది ప్రకటన కాదు.. ఓ కళాకృతి అంతే. నగరంలోని స్కైలైన్‌లో మరిన్ని కుడ్యచిత్రాలను రూపొందించేందుకు కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ఇది దోహదపడుతుంది. 2013లో బాలీవుడ్ ఇండస్ట్రీ 100 ఏళ్లు పూర్తిచేసుకోగా.. అదే ఏడాది BAPని ప్రారంభించాం. ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణె తదితర నగరాల్లో బిగ్ మ్యూరల్స్ చిత్రించాను’.
– రంజిత్ దహియా, BAP వ్యవస్థాపకుడు