ఆ రాశి వారికి విదేశీ ప్రయాణ అవకాశం..

by Hamsa |
Panchangam
X

తేది : 05 జూలై 2021

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : ఏకాదశి
(నిన్న రాత్రి 7 గం॥ 58 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 30 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(నిన్న ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 12 ని॥ వరకు)
యోగము : ధృతి
కరణం : బవ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఉదయం 6 గం॥ 47 ని॥ నుంచి 8 గం॥ 35 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 12 గం॥ 46 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు)( సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి 4 గం॥ 15 ని॥ వరకు)
రాహుకాలం : (ఉదయం 7 గం॥ 24 ని॥ నుంచి 9 గం॥ 2 ని॥ వరకు)
గుళికకాలం : (మధ్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి 3 గం॥ 36 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 10 గం॥ 41 ని॥ నుంచి మధ్యాహ్నం 12 గం॥ 19 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మేషము

మేషరాశి : కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్. సంఘంలో పేరు ప్రతిష్టలు. పిరికి వారిలాగా ఆలోచించకండి. మీ దైర్యాన్ని మీరు గుర్తించండి. ఆదాయం బాగుంది ఖర్చులను అవసరాల మేరకు నియంత్రించండి. కుటుంబ వ్యవహారాలు గురించి కుటుంబ సభ్యులతో సంప్రదించండి. పెద్ద వారి సలహాలు తీసుకోండి. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి కావాలంటే మీరు మరింత కష్టపడాలి. తొందరపడి ఎవరికీ మాట ఇవ్వకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి : కొంతమందికి విదేశీ ప్రయాణ అవకాశాలు. స్థిరాస్థి వ్యవహారాలు మీకు అనుకూలం. ఉన్న వస్తువులను మళ్లీ కొనడం ద్వారా డబ్బు వృధా. ఆఫీసులో పనులు జరుగుతున్నాయా లేదా గమనించండి కింది వారి మీద వదిలిపెడితే కష్టం. కుటుంబ వ్యక్తుల తో కొంత సమయం గడపండి వారితో పరుషంగా మాట్లాడకండి. కళాకారులకు మంచి అవకాశాలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

మిథున రాశి : మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. మీకు అందిన వార్త మిమ్మల్ని ఈ రోజంతా ఆనందంగా ఉంచుతుంది. కొంతమంది ఇల్లు మార్పుకై ప్రయత్నాలు చేస్తారు. ఆఫీసు పనులలో మీ నూతన ప్రణాళికలు పనిచేస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటు ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

కర్కాటక రాశి : మానవసేవే మాధవసేవ ఇతరులకు సహాయం చేయడం వలన మీకు దైవ బలం. ఆదాయ వ్యవహారాలు బాగుండాలంటే అనవసరపు ఖర్చులను నివారించండి. మీ చిరకాల కోరిక తీరే అవకాశం వచ్చింది ముఖ్యమైన నిర్ణయాలను మీరే ఆలోచించి తీసుకోండి. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. ఆఫీసులో మీ పని సామర్థ్యం పై అందరి ప్రశంసలు ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

సింహరాశి : సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఫలితాల గురించి అతిగా ఊహించకండి. ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధించడానికి ప్రయత్నించండి. మీ చెడు అలవాట్ల గురించి మీ భార్య భర్తల గొడవలు పడతారు. చెడు అలవాట్లను వదిలివేయడం మంచిది. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతల వలన అధిక శ్రమ. దానివలన వెన్నునొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కన్యారాశి : ఇంటిలో వ్రతాలు పూజలు చేయటం వలన దైవ బలం తోడవుతుంది. మానవసేవే మాధవసేవ ఇతరులకు సహాయం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. మీ పిల్లల చదువులను జాగ్రత్తగా గమనించండి. అవసరమైన సలహాలు ఇవ్వండి. కొందరు ఉద్యోగులకు ప్రమోషన్. కొత్త నగలను కొంటారు. వ్యాపారస్తులకు లాభాలను తెచ్చే డీల్ దొరుకుతుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

తులారాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను వస్తాయి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి ముఖ్యంగా పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. దుబారా ఖర్చులను నివారించడం వల్ల ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి. ఆఫీసు పనులలో మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పండి. పనులను సకాలంలో పూర్తి చేస్తారు కొంతమందికి ఆఫీస్ టూర్స్. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మిమ్మల్ని ఆశ్చర్యపరచ బోతున్నారు ఆనందించండి.

వృశ్చిక రాశి : స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ కొరకు కొంత సమయం కేటాయించుకోవడం వలన రిఫ్రెష్ అవుతారు. ఒత్తిడిని అధిగమించండి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. అనుకోని అతిథుల వలన మీ రోజువారీ కార్యక్రమం దెబ్బతింటుంది. ముఖ్య అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. ఆఫీసు పని మీద శ్రద్ధ పెట్టండి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

ధనస్సు రాశి : మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబం లో ఆహ్లాదకర వాతావరణం. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. కొంతమంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కొంతమంది ఉద్యోగులకు పాత బకాయిలు అందుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపార రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. సమయానికి తగిన డబ్బు అందకపోవడం వలన పనులు ఆగిపోతాయి ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. మీ కింది ఉద్యోగులు బాధ్యతా రహితంగా ఉండటం మిమ్మల్ని నిరాశపరుస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ కోపాన్ని మీ భర్త మీద చూపించకండి. దానివలన గొడవలు పెరుగుతాయి.

మకర రాశి : ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి. లేకుంటే వ్యవహారాలు చాలా దూరం వెళతాయి. స్థిరాస్తి వ్యవహారాలు నష్టాలను తెచ్చే అవకాశం. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. వ్యాపారస్తులు తమ ఆదాయ వ్యవహారాలను ఒక సారి జాగ్రత్తగా గమనించండి. మీ అభిప్రాయాలను ఇతరులమీద రుద్దకండి. ఆఫీసులో మీ పని సామర్ధ్యం పై అందరి ప్రశంసలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మిమ్మల్ని ఆనంద పరుస్తుంది మీ వైవాహిక జీవితంలో ఒక తీపి రోజు.

కుంభరాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. పాత అపజయాలను మర్చిపోండి మీ భార్య భర్తల సామరస్య ధోరణి వల్ల కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. అప్పు ఎవ్వరికీ ఇవ్వకండి. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. దేవాలయాలను సందర్శించడం వలన దైవ బలం. ఆఫీసులో మీ పని సామర్ధ్యం పై అందరి ప్రశంసలు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి : స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు దాని వలన ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. దాని వలన వెన్ను నొప్పి కాళ్ళనొప్పులు. ఆదాయ వ్యవహారాలు పరవాలేదు దుబారా ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు సామరస్యంగా కుటుంబ విషయాలను చర్చించుకోండి.

Advertisement

Next Story