ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మీ రాశి ప్రకారం తెలుసుకోండిలా..!

by Hamsa |
ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మీ రాశి ప్రకారం తెలుసుకోండిలా..!
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ఏకాదశి
(నిన్న సాయంత్రం 4 గం॥ 18 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 29 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(నిన్న రాత్రి 6 గం॥ 47 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 43 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (నిన్న రాత్రి 11 గం॥ 54 ని॥ నుంచి తెల్లవారు జాము 1 గం॥ 21 ని॥ వరకు)(ఈ రోజు రాత్రి 9 గం॥ 46 ని॥ నుంచి 11 గం॥ 12 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఉదయం 8 గం॥ 40 ని॥ నుంచి 10 గం॥ 7 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 12 గం॥ 43 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 35 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 21 ని॥ నుంచి 4 గం॥ 13 ని॥ వరకు)
రాహుకాలం : (ఉదయం 7 గం॥ 20 ని॥ నుంచి 8 గం॥ 58 ని॥ వరకు)
గుళికకాలం : (మధ్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 33 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 10 గం॥ 38 ని॥ నుంచి 12 గం॥ 16 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 52 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : తుల

మేషరాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. మీ ఎదుగుదలకు అవసరమైన ముఖ్య నిర్ణయాలను తీసుకోంటారు. నూతన వ్యక్తులతో పరిచయం లాభకరం. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భార్య భర్తల మధ్య గొడవలు సర్దుకుంటాయి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అందరి మెప్పును పొందుతారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది అవసరాలకు ఖర్చు పెడతారు. మీ వలన ఎవరైనా నష్టపోతే వారికి క్షమాపణలు చెప్పండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి : అనుకున్న కార్యాన్ని సాధించాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. దైవప్రార్థన వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మొరటుతనం వలన మీ భార్య ఇబ్బంది పడుతుంది. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. అనారోగ్యం నుంచి బయట పడతారు ఆరోగ్యం చక్కబడుతుంది. దాన ధర్మాల వలన మానసిక ప్రశాంతత. ఆఫీసులో అధిక బాధ్యతల వలన శ్రమ ఒత్తిడి. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మిధున రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే అధిక శ్రమ అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బయటి తిండి వలన అజీర్తి. మీ దుబారా అనవసరపు ఖర్చు ఇంట్లో పెద్ద వాళ్ళని బాధ పెడుతుంది. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. దీని వలన ఒత్తిడి తగ్గుతుంది. మీ కోపతాపాలు కుటుంబ సభ్యుల మీద చూపించకండి. పెట్టుబడుల విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలను మీరే తీసుకోండి. ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. కొంతమంది ఇంటి మరమ్మతుల కోసం ఖర్చు పెడతారు. ఎలర్జీ వలన చర్మ సంబంధిత వ్యాధి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటుతనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది

కర్కాటక రాశి : దేవాలయాలను సందర్శిస్తారు. తొందరపాటు వద్దు సహనంతో అనుకున్న కార్యాలను సాధించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బయటి తిండి వల్ల అజీర్తి. యోగా మెడిటేషన్ వలన మానసిక శారీరక ఆరోగ్యం. అవసరాలకు కావలసిన డబ్బు చేతికందుతుంది. స్థిరాస్తి అమ్మకాల వలన అనుకోని లాభాలు. అనవసరపు ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో జరుగుతున్న గొడవలు మిమ్మల్ని బాధ పెడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. డబ్బు పెట్టుబడులపై కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి.

సింహరాశి : గందరగోళం వలన సరైన కమ్యూనికేషన్ చేయలేరు. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. నిదానంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. సహోదరుల బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరికి ఉద్యోగపరంగా టూర్స్. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. ఆఫీసులో పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు. బహుమానాలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్ చేయండి.ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కన్యారాశి : కుటుంబంలోని పెద్ద వారి ఆశీర్వచనాలు తీసుకోండి. శారీరక మానసిక ఆరోగ్యం కొరకు యోగా మెడిటేషన్ చేయండి. కొంత మంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు దుబారా అనవసరపు ఖర్చులను నివారించండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్. అనవసరపు బాతాఖానిల వలన సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ భర్త కుటుంబ విషయాల గురించి పూర్తిగా మీతో మాట్లాడటం లేదని మానసిక అశాంతి.

తులారాశి : దైవ ప్రార్ధన వలన మానసిక బలం. ఆఫీసు పనుల్లో ఒత్తిడిని ఇంటికి తీసుకురాకండి. పట్టుదల ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రామిస్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆదాయం కన్నా ఖర్చులు అధికం. బయట తిండి వల్ల అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటుతనం ఇబ్బంది పెడుతుంది.

వృశ్చిక రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. శారీరక మానసిక ఆరోగ్యం కొరకు యోగా మెడిటేషన్ చేయండి దేవాలయ సందర్శనం వలన మానసిక ప్రశాంతత. ఇల్లు కొనుగోలు చేస్తారు. ఆఫీసు పనులను పెండింగ్ లేకుండా పూర్తి చేయండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. కుటుంబంలోని ప్రశంసిస్తారు. డబ్బును సరైన పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆఫీసులో పనులను అధిక సామర్థ్యంతో పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం వలన ఆనందం.

ధనస్సు రాశి : దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసు మీకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవరికి పడితే వాళ్ళకు అప్పు ఇవ్వకండి డబ్బులు తిరిగి రాకపోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. కావలసిన ధనం చేతికందుతుంది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

మకర రాశి : సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆత్మీయుల నుండి బహుమానాలు అందుకుంటారు. స్నేహితుల బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు. కుదిరితే ప్రయాణాలు వాయిదా వేయండి. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళికలు తప్పనిసరి. కావాల్సినంత ధనం చేతికందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కీళ్ల నొప్పులకు అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కుంభరాశి : ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు. దైవప్రార్థన వలన మానసిక బలం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ సామర్థ్యం పట్ల ప్రశంసలు. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నిస్తారు. కుటుంబ వ్యవహారాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడండి. వారి సపోర్ట్ మీకు ఉంది. కావాల్సినంత ధనం చేతికందుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఎలర్జీ వలన జలుబు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది

మీన రాశి : ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అధిక శ్రమ వలన కీళ్ల నొప్పులు. ఇల్లు కొనుగోలు చేస్తారు. సరైన వేళకు సరైన భోజనం చేయండి. ఆఫీసులో మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మీ పని సామర్థ్యం పై నోరు మెదప లేక పోతారు. ఆత్మన్యూనతా భావం వదిలివేయండి. మరింత డబ్బు సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపార విస్తరణ కోసం ప్రయాణాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం వలన ఆనందం.

Advertisement

Next Story