ఉప్పల్ ఇండోర్ స్టేడియంలో సోమవారం సంత

by Shyam |
ఉప్పల్ ఇండోర్ స్టేడియంలో సోమవారం సంత
X

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉప్పల్ ఇండోర్ స్టేడియంలో కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణశేఖర్ ఆధ్వర్యంలో మార్కెట్ స్థలంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ర్పే చేయించారు. బీరప్పగడ్డలో ప్రతీ సోమవారం జరిగే సంతను స్టేడియంలో ఏర్పాటు చేసి కూరగాయలు తీసుకునేవారికోసం సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, హబ్సిగూడ కార్పొరేటర్ భేతి స్వప్న, ట్రాన్స్ పోర్ట్ ఏఈ రాకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags : Monday market at Uppal Indoor Stadium, uppal stadium

Advertisement

Next Story