బుల్లితెరపై సందడి చేయనున్న మోనాల్

by Shyam |
బుల్లితెరపై సందడి చేయనున్న మోనాల్
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరోయిన్‌గా చేసిన సినిమాలతో ఏమంత గుర్తింపు తెచ్చుకోని గుజరాతీ భామ మోనాల్ గజ్జర్.. తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 4’కంటెస్టెంట్‌గా ఫుల్ పాపులారిటీని సంపాదించింది. బిగ్ బాస్ హౌజ్‌లో అభిజిత్‌తో కొన్ని రోజులు ట్రాక్ నడిపిన మోనాల్.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ తనదైన గేమ్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. మొత్తానికైతే బిగ్ బాస్ వీక్షకుల అభిమానాన్ని మాత్రం సంపాదించింది. అయితే తాజాగా హౌస్‌ నుంచి బయటికొచ్చాక.. ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయని సమాచారం.

ఈ క్రమంలోనే స్టార్ మాలో ఆదివారం నుంచి ప్రసారం కాబోయే ‘డ్యాన్స్ ప్లస్’ షోలో మోనాల్ పాల్గొన‌బోతున్నట్లుగా వస్తున్న వార్తలను కన్‌ఫర్మ్ చేస్తూ స్టార్ మా నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా ఓ ప్రోమోను విడుద‌ల చేశారు. అందులో ‘వ‌న్ డే టు గో’ అంటూ త‌న‌దైన స్టైల్‌లో చెప్పింది మోనాల్. అయితే ఈ షోలో మోనాల్ మెంటార్‌గా ఉండ‌నుందా? లేక జ‌డ్జిగా ఉండ‌బోతుందా అనేది సస్పెన్స్.

Advertisement

Next Story