ఇండోనేషియా లాంగ్వేజ్‌లో భారతీయ సినిమా..

by Shyam |   ( Updated:2021-09-17 07:01:16.0  )
Mohanlal Drishyam
X

దిశ, సినిమా : భారతీయ సినిమా కల్చర్‌లో ఓ భాషలో హిట్‌ అయిన కథలను మరో భాషలో రీమేక్‌ చేయడం మాములే.. కానీ ఓ ఇండియా సినిమా విదేశీ భాషల్లో రీమేక్‌ అవడం చాలా తక్కువ. అందులో సౌత్‌ ఇండియన్‌ మూవీ కావడం ఇంకా అరుదు. అయితే తాజాగా మాలయాళం సూపర్‌ హిట్‌ సినిమా ‘దృశ్యం’ త్వరలో ఇండోనేషియా లాంగ్వేజ్‌లోకి వెళ్లనుందని చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘మోహన్‌లాల్‌ హీరోగా, జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘దృశ్యం’ ఇప్పటి వరకు 4 ఇండియన్‌ లాంగ్వేజేస్‌తోపాటు చైనీస్‌, శ్రీలంకన్‌ భాష‌ల్లో విడుదలై మంచి ప్రజధారణ పొందింది. ఇప్పుడు ఇండోనేషియా భాషలో కూడా రూపొందించడం, సినిమా దేశ సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది’ అని ఆంటోని తెలిపాడు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలోని పీటీ ఫాల్కన్ అనే సంస్థ నిర్మించనుండగా.. చైనీస్‌లో రీమేక్‌ అయిన మొదటి మలయాళ చిత్రం కూడ ఇదే కావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed