- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోహన్‌బాబు జన్మరహస్యం అదే!
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తన పుట్టుక రహస్యాన్ని వివరించారు. మహాశివరాత్రి తనకు, తన కుటుంబానికి ఎంత ప్రత్యేకమో తెలిపారు. ఈశ్వరుడికి, తనకు ఉన్న అనుబంధం రహస్యమని, ఆ రహస్యాన్ని మీకు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.
”మహాశివరాత్రి అత్యద్భుతమైన రోజు. ముఖ్యంగా మా కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఎందుకంటే మాది తిరుపతి-కాళహస్తిల మధ్య చిన్న పల్లెటూరు మోదుగుళ్లపాలెం. మా అమ్మానాన్నలకు వివాహమై ఎన్నో ఏళ్ళు సంతానం కలగకపోతే ఎవరో చెప్పారట, ఇక్కడకి ఒక 5 కిలోమీటర్లు నడిచి, మరో 5 కిలోమీటర్లు కొండెక్కితే.. అడవిలో బత్తినీయస్వామి అని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరునికి మొక్కుకుంటే పిల్లలు పుడతారని. ఆ భగవంతుడిని దర్శించుకుని వచ్చారు, మా అమ్మకు ఐదుగురు సంతానం కలిగారు. అందుకనే నా పేరు భక్తవత్సలం అని పెట్టారు మా నాన్నగారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మోహన్ బాబుగా మారింది” అని తెలిపారు.
తనతోపాటు తన పిల్లలు కూడా పరమేశ్వరుని వరమే అని తెలిపిన మోహన్ బాబు.. అందుకే ఈ మహాశివరాత్రి మాకు పర్వదినం అయిందన్నారు. కాగా… మోహన్ బాబు మనవరాలు, మంచు లక్ష్మీ కూతురు విద్య నిర్వాణ ఈ మహాశివరాత్రి రోజునే సంగీత సామ్రాజ్యంలోకి అడుగుపెట్టింది.