వన్ వరల్డ్.. వన్ హెల్త్

by Shamantha N |
Prime Minister Modi to attend G7 summit
X

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న జీ7 సదస్సును ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఒకే జగతి.. ఒకే ప్రాణ విలువ అనే మంత్రాన్ని ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలని అన్నారు. ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా మహమ్మారిపై పోరాడాలని, భవిష్యత్‌‌లోనూ ఇలాంటి సంక్షోభాలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ప్రజాస్వామిక దేశాలపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉండాలని అన్నారు.

కరోనా కట్టడికి కావాల్సిన సాంకేతికతలో మేధో సంపత్తిని దేశాలు పరస్పరం పంచుకోవాలని తెలిపారు. ఇందుకోసం భారత్, దక్షిణాఫ్రికాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో చేసిన ట్రిప్స్ ప్రతిపాదనను జీ7 దేశాలు మద్దతు తెలుపాలని కోరారు. ఈ సందర్భంగా భారత్‌లో కరోనాపై పోరాడిన తీరును వివరించారు. కరోనాపై మొత్తం సమాజం సంయుక్తంగా పోరాడిందని, ప్రభుత్వ, పారిశ్రామిక, పౌరులూ శక్తివంచన లేకుండా తోడ్పడ్డారని తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్, వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ కోసం భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఓపెన్ సోర్స్ డిజిటల్ టూల్స్ వినియోగించుకుందని, ఈ అనుభవాన్ని, నైపుణ్యాలను ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకూ బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు

Advertisement

Next Story

Most Viewed