యోగా.. ఒక ఆశాకిరణం: నరేంద్రమోడీ

by Shamantha N |   ( Updated:2021-06-21 10:08:39.0  )
Prime Minister Modi to attend G7 summit
X

న్యూఢిల్లీ: కరోనా విపత్కర పరిస్థితుల్లో యోగా ఒక ఆశాకిరణంగా కనిపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మహమ్మారి కాలంలో ప్రజల అంతర్గత శక్తిని కూడదీసిందని, వైరస్‌తో పోరాడగలమన్న విశ్వాసాన్ని నింపిందని తెలిపారు. ఒత్తిడి నుంచి బలంవైపు, నెగెటివి నుంచి క్రియేటివిటీ వైపు నడిపిస్తుందని వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ సోమవారం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘కరోనా తొలిసారి వెలుగులోకి వచ్చినప్పుడు ఏ దేశమూ దానిపై పోరాటానికి సిద్ధమై లేదు. అలాంటి సమయంలో యోగా అందరికీ తోడ్పడింది. ఇప్పుడు యోగా అంత:శక్తికి వనరుగా ఉన్నది. ఇది క్రమశిక్షణను అలవరస్తుంది. కరోనాపై పోరాడే ధైర్యాన్ని నింపుతుంది. ఫ్రంట్‌లైన్ వారియర్లూ ఈ విషయాన్ని నాతో పంచుకున్నారు. కరోనా వైరస్‌పై పోరాడటంతో యోగాను తమ ఆయుధంగా వినియోగిస్తున్నామని చెప్పారు. ఇది కేవలం భౌతికంగానే కాదు, మానిసకంగానూ పటిష్టపరుస్తుంది. యోగాతో మానవ దేహానికి, రోగనిరోధక శక్తికి కలిసివచ్చే అంశాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసుల ముందు పిల్లలు ప్రాణాయామం చేస్తున్నారు. ఇది వారికి ఉపకరిస్తుంది’ అని వివరించారు.

ఎం-యోగా యాప్

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)తో కలిసి ఎం-యోగా అప్లికేషన్‌ను లాంచ్ చేయనున్నట్టు ప్రధాని మోడీ వెల్లడించారు. ఇందులో యోగా ట్రైనింగ్ వీడియోలు, ప్రొటోకాల్స్ ఉంటాయని, వివిధ భాషల్లో ఇవి ఉన్నాయని తెలిపారు. తద్వారా ప్రపంచదేశాలూ యోగాను అనుసరించడం సులువు అవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed