- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఏపీ అభివృద్ధికి అనేక నిధులు ఇచ్చాము’
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక నిధులు ఇచ్చారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. దేశంలోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో ఏపీ 3వ స్థానంలో, స్థూల దేశీయ ఉత్పత్తిలో ఏపీ 9వ ర్యాంక్‌లో ఉందని తెలిపారు. రైతు యోజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 47 లక్షల మంది రైతుల అకౌంట్లలో 936.16 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశామని అన్నారు. కొవిడ్ ఫైట్ కింద ఏపీకి 8025 కోట్ల రూపాయలు ఇచ్చామని వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలతో గతంలో జరిగిన అగ్రిమెంట్లను ఏపీ క్యాన్సిల్ చేయడం వల్ల, భారతదేశ ప్రాజెక్ట్‌లలో అనేక ఇబ్బందులు వస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఒక స్థాయిలో 2.70 పైసలకు విద్యుత్ ఇస్తున్నప్పటికీ, ఏపీలో 9 రూపాయలు ఛార్జ్ చేయడం విని ఆశ్చర్యపోయామని అన్నారు. కరోనా ఇబ్బందులు అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వడంతో పాటు పేదల జన్ ధన్ యోజన ఖాతాల్లో 500 రూపాయలు చొప్పున 3 నెలలు జమ చేశామని ఆమె తెలిపారు.